కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి ఓ భార్య, భర్తను హత్య చేయించింది. లింగంపల్లికి చెందిన గంగయ్య భార్య సంధ్యకు, బాలరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ బంధానికి అడ్డుగా ఉన్న గంగయ్యను ప్రియుడి సహాయంతో సంధ్య హత్య చేయించింది. ఈ నెల 22 నుంచి కనిపించకుండా పోయిన గంగయ్య రాయచోటి గువ్వల చెరువు ఘాట్‌లో శవమై కనిపించాడు.