అమ్మాయిలు సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడే స్నేహాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇన్‌స్టాగ్రామ్ పరిచయమే కారణంగా సికింద్రాబాద్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాధిత బాలికతో ఇద్దరు యువకులు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని, ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నారు. వీడియోలు తీసి బాలికను భయపెట్టారు. వీడియోలు తిరిగి ఇస్తామని పిలిచి స్నేహితులతో కలిసి మరోమారు దారుణానికి పాల్పడ్డారు.