Homeహైదరాబాద్latest Newsఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం.. అర్ధరాత్రి అత్త, కోడలుపై సామూహిక అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం.. అర్ధరాత్రి అత్త, కోడలుపై సామూహిక అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి అత్త, కోడలుపై సామూహిక అత్యాచారం చేశారు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో అత్త కోడళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. నల్లబొమ్మని పల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న పేపర్‌ మిల్లులో ఓ కుటుంబం వాచ్‌మెన్‌గా చేరింది. బళ్లారికి చెందిన కుటుంబం ఉపాధి కోసం ఐదు నెలల క్రితం ఇక్కడికి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రెండు బైక్‌లపై దుండగులు వచ్చి కత్తులతో బెదిరించి.. బలవంతంగా పక్కకు లాక్కెల్లి అత్త, కోడలుపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు.. ఆపై అక్కడి నుంచి పరారయ్యారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img