హైదరాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ఘటకేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్‌పూర్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్ పై వెళ్తున్న కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే మంటలు చెలరేగడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు జీవ దహనం అయ్యారు.కారులో ఉన్నవారి అరుపులు విని వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే భారీగా మంటలు చెలరేగడంతో కాపాడేందుకు అవకాశం లేకుండా పోయింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది