Homeహైదరాబాద్latest Newsకాటేదాన్‌లో దారుణం, మహిళ తలపై బండరాయితో మోది హత్య

కాటేదాన్‌లో దారుణం, మహిళ తలపై బండరాయితో మోది హత్య

HYDERABAD : ప్రస్తుత సమాజంలో స్త్రీలపై అకృత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో చోట దారుణం జరుతూనే ఉంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని కాటేదాన్‌లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ మహిళపై కొందరు దుండగులు పైశాచికత్వం ప్రదర్శించారు. చిత్రహింసకు గురిచేసి హతమార్చారు. కాటేదాన్‌లో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..శుక్రవారం ఉదయం స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని సమీరాఖాన్‌ అనే యువతిగా గుర్తించారు. తలపై కొందరు దుండగులు బండరాయితో మోది హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిపై అత్యాచారం చేసిన తర్వాత ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. క్లూస్ టీం, డాగ్ స్కాట్ బృందాలు రంగంలోకి దిగి ఆధారాలు కోసం గాలిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img