HomeజాతీయంWoman in burqa : బురఖా వేసుకుందని అమ్మాయిని కొట్టిన అకతాయిలు

Woman in burqa : బురఖా వేసుకుందని అమ్మాయిని కొట్టిన అకతాయిలు

Woman in burqa : బురఖా వేసుకుందని అమ్మాయిని కొట్టిన అకతాయిలు

Woman in burqa : మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఒక యువతిపై ఇద్దరు ఆకతాయిలు దాడి చేశారు.

ఆమె ఒక హిందువు అయి ఉండి ముస్లిం యువతిలాగా బుర్కా ధరించి వెళుతున్నందుకు ఆ ఇద్దరు పసిగట్టి ఆమెపై దాడి చేశారు.

ఈ ఘటనను పక్కనే ఉన్న వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు దానిని చూసి ఆకతాయిలను అరెస్టు చేశారు.

బాధితురాలిని విచారణ చేయగా.. ఆమె తన స్నేహితులతో రోడ్డుపై వెళుతుండగా.. ఆ ఇద్దరు యువకులు వచ్చి తన బుర్కాని తీసి చూశారని,

వారికి తను హిందువు అని తెలియడంతో తనను కొట్టారని చెప్పింది.

కానీ ఈ విషయమై ఫిర్యాదు చేస్తే తన తల్లిదండ్రులకు తెలిసిపోతుందనే భయంతో పోలీసుల వద్దకు రాలేదని చెప్పింది.

ఫిర్యాదు అందకపోయినా ఆకతాయిలు మరోసారి తప్పు చేయకూడదనే ఉద్దేశ్యంతో వారిని అరెస్టు చేశామని పోలీసులు అన్నారు.

దీనిపై స్పందించిన పలువురు మత పెద్దలు తమ ఆచారాలను ఇతరులు కూడా పాటించడంలో తప్పు లేదని తెలిపారు.

Recent

- Advertisment -spot_img