Homeజిల్లా వార్తలుదసరా వేడుకల్లో దళితులపై దాడి

దసరా వేడుకల్లో దళితులపై దాడి

ఇదే నిజం, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కాన్నారావుపేట గ్రామంలో విజయ దశమి రోజు దళితులపై దాడి జరిగింది. విజయదశమి పండుగను పురస్కరించుకొని డప్పులు కొట్టుతున్న కలకోటి గణేష్, అశోక్ ,రాజేష్ ల ను పసుల తరుణ్ అతని తండ్రి సహదేవ్ కులం పేరుతో దూషించి కర్రలతో కొట్టి గాయపరిచారు. గ్రామస్తులు గొడవను సద్దుమణించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. శనివారం ఆస్పత్రిలో ఉన్నందున ఆదివారం రోజు నల్లబెల్లి మండల పోలీస్ స్టేషన్లో బాధితులు కలకోట రాజేష్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మన దేశంలో దళితులు, గిరిజన-ఆదీవాసీలపై ప్రదర్శించే సామాజిక వివక్ష, దాడులు, అణచివేత, అత్యాచారాలను నియంత్రించడం కోసం ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) యాక్ట్, 1989లో ఏర్పాటైంది. కానీ దళిత, గిరిజన సమాజంపై వివక్ష, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులపై కేసులు పెట్టడానికే భయపడి మౌనంగా భరిస్తున్న ఉదంతాలు కొన్ని ఉంటే, ధైర్యం చేసి కేసు పెట్టినా సరే.. విచారణ ముగిసి నిందితులకు శిక్ష పడేలా చేయడంలో సఫలం కాలేకపోతున్నాయి.

Recent

- Advertisment -spot_img