శనివారం సాయంత్రం దక్షిణ ఢిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై లిక్విడ్ పోసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసు భద్రతా విభాగం శనివారం పట్టుకుంది. గ్రేటర్ కైలాష్ వద్ద ఆయన పాదయాత్రలో ఈ ఘటన జరిగింది.అయితే ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అతిషి స్పందించారు. ఇది ముమ్మాటికీ బీజేపీ పార్టీ పనే అని సీఎం అతిషి ఆరోపించారు. ఇలాంటి చౌకబారు చర్యలకు ఢిల్లీ ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని అని సీఎం అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు.