Homeహైదరాబాద్latest Newsపవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దాడి.. ఏం జరిగిందంటే..?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దాడి.. ఏం జరిగిందంటే..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన ఉన్న ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. రాడ్లు, రాళ్లు, కత్తులతో దుండగులు దాడికి పాల్పడ్డారు. దాడి ఆనవాళ్లు లేకుండా సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోకి పవన్‌కల్యాణ్ ఇంటికి సెక్యూరిటీగా పని చేస్తున్నాడు వెంకట్ అనే వ్యక్తి. ఆయన తన భార్యతో కలిసి మీర్‌పేట్‌లోని లెనిన్‌నగర్ ఐదేళ్లుగా ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లులు కూడా. అయితే ఇంటికి ఎదురుగా ఉండే రాజు బంధువులతో పాత గొడవలు ఉన్నాయి. ఇంటిముందు ఉండే ఓ అబ్బాయి.. వెంకట్ కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంకట్ వైఫ్ సరిత జోక్యం చేసుకుని అబ్బాయిని వారించింది. ఇక్కడి నుంచి మొదలైన ఈ గొడవ, చినికి చినికి గాలి వానగా మారింది.

బుధవారం రాత్రి వేళ రాజు బంధువులు వెంకట్ ఇంటిపై దాడి చేశాడు. కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. అంతేకాదు వెంకట్ కుటుంబసభ్యులపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. వెంకట్ ఇంటిముందున్న బైక్‌ను డ్యామేజ్ చేశారు. దాన్ని తగల బెట్టడానికి సిద్ధమైన సమయంలో వెంకట్‌పైనా దాడికి యత్నించాడు. ఈలోగా స్థానికులు జోక్యం చేసుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ ఆ వ్యక్తులు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారేమోనని హడలిపోతోంది వెంకట్ ఫ్యామిలీ. ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Recent

- Advertisment -spot_img