హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ దాడుల కలకలం రేపాయి . సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. హైదరాబాద్ లోని ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ జరుగుతున్నాయి. ఏక కాలంలో 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఈ దాడులు నిర్వహిస్తోంది. సాహితీ ఇన్ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వర్ రావు వ్యవహరిస్తున్నారు. గతంలో ఓ కేసు విషయంలో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారని తెలుస్తోంది. ఇంకా సీసీఎస్ లో పలు కీలక కేసులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రంలోగా ఆయన అక్రమ ఆస్తులపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.