ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని ఆ పార్టీ నేతలు కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదలతో ఇబ్బంది పడుతున్న ఖమ్మం ప్రజలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన కలిసి నిత్యవసర సరుకులు, ఆర్థిక సహాయం అందించడానికి వెళ్లిన మాజీ మంత్రిలు హరీష్ రావు, శ్రీమతి సబితాఇంద్రారెడ్డి , జగదీశ్వర్ రెడ్డి , అజయ్ కుమార్ ఉన్న వాహనాన్ని అడ్డుకొని, రాళ్లతో గూండాల్లా దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల తీరు అప్రజాస్వామికమైన చర్యగా భావిస్తూ తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ , బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి సీనియర్ నాయకులు కంచం నర్సింలు, ఎండి జహంగీర్, కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షుడు వంగూరి దిలీప్, తదితరులు పాల్గొన్నారు.