HomeEnglishAttacks on Gaza must stop Gaza పై దాడులను ఆపాలి

Attacks on Gaza must stop Gaza పై దాడులను ఆపాలి

– ఇజ్రాయెల్​ను హెచ్చరించిన ఇరాన్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: హమాస్‌ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని గాజాలో ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న భీకర దాడులను ఇరాన్‌ మరోసారి తీవ్రంగా ఖండించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణను వెంటనే ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై కఠిన చర్యలు చేపట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరబ్దొల్లాహియాన్ చెప్పినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.‘గాజాలో ఇజ్రాయెల్‌ దురాక్రమణ ఆపకపోతే..

ఈ ప్రాంతంలోని అన్ని దేశాల చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి’అని హుస్సేన్‌ హెచ్చరించారు. ఈ సందర్భంగా హమాస్‌ దాడుల నాటి నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటిస్తున్న అమెరికాను కూడా ఇరాన్‌ విమర్శించింది. ‘ఇలాంటి పరిస్థితులు నియంత్రిస్తామని, ఘర్షణలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా చూస్తామని ఎవరూ హామీ ఇవ్వలేరు. యుద్ధాన్ని ఆపాలని, సంక్షోభాన్ని అరికట్టాలనే ఆసక్తి ఉన్నవారు.. గాజాలో పౌరులపై జరుగుతున్న అనాగరిక దాడులను అడ్డుకోవాలి’అని అమెరికాను ఉద్దేశిస్తూ హుస్సేన్‌ పరోక్ష విమర్శలు చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img