Homeహైదరాబాద్latest Newsగుడుంబా స్థావరాలపై దాడులు.. ఇద్దరిపై కేసు నమోదు

గుడుంబా స్థావరాలపై దాడులు.. ఇద్దరిపై కేసు నమోదు

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రం పరిధిలో, మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, చిన్న ఎయెల్లాపురం, కారంపూడి తండా లలో గుడుంబా స్థావరాలపై మూకుమ్మడి దాడులను, గూడూరు పోలీస్ అధికారులు నిర్వహించారు. ఈ దాడులలో భాగంగా, సుమారు 600 లీటర్ల జాగిరి వాష్ ను ధ్వంసం చేసి, 20 లీటర్ల గుడంబాను సీజ్ చేసి, ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్ స్పెక్టర్ కె. బాబురావు, సబ్ ఇన్ స్పెక్టర్ సిహెచ్. నగేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img