హైదరాబాద్, ఇదేనిజం : పోలీసు విభాగంలోపి టీఎస్ఎస్పీ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్థులు మంగళవారం డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఇందులో భాగంగా డీజీపీ కార్యలయానికి వచ్చిన పలువురు అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లడుతూ….. దాదాపు 9నెలలు అవుతున్నా ఇప్పటి వరకు మాకు శిక్షణ ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గువుతున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. మాతోపాటు సమానంగా సెలక్ట్ అయిన అభ్యర్థులకు (సివిల్, ఏఆర్, అభ్యుర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జితాలు ఇస్తున్నారని) కానీ టీఎస్ఎస్పీ, అభ్యర్థులకు మాత్రం ఇప్పటి వరకు శిక్షణకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదన్న అభ్యర్థులు, ఇప్పటికి చాలమంది సెలక్ట్ అయిన అభ్యర్థులు చనిపోయారని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వారు పేర్కోన్నారు. వేంటనే డీజీపీ స్పందించి శిక్షణ తేదిని ప్రకటించి వేతనాలు ఇవ్వాలని అభ్యుర్థులు డిమాండ్చేశారు.
డీజీపీ కార్యలయం ముట్టడికి టీఎస్ఏస్పీ అభ్యర్థుల యత్నం
RELATED ARTICLES