Homeహైదరాబాద్latest NewsAurangzeb : క్రూరుడైన ఔరంగజేబు సమాధిపై సబ్జా మొక్క.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి..?

Aurangzeb : క్రూరుడైన ఔరంగజేబు సమాధిపై సబ్జా మొక్క.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి..?

Aurangzeb : భారతదేశాన్ని పాలించిన చివరి మొఘల్ చక్రవర్తిగా ఔరంగజేబు (Aurangzeb) పరిగణించబడ్డాడు. ఔరంగజేబు చక్రవర్తిగా కంటే అతను ఒక క్రూరుడిగానే పేరు గాంచాడు. ఎంతలా అంటే ఔరంగజేబు తన సొంత తండ్రిని ఖైదు చేసాడు, మరియు అతని సోదరుడిని చంపాడు మరియు సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతర మొఘల్ చక్రవర్తులతో పోలిస్తే.. ఔరంగజేబు చాలా క్రూరమైన వ్యక్తి అని చరిత్ర చెబుతుంది. అయితే ఔరంగజేబు ముఖ్యంగా హిందువులపై వివక్షా చూపించాడు. అలాగే అనేక హిందూ దేవాలయాలను కూల్చివేసిన హీనుడిగా నిలిచాడు. ఛత్రపతి శివాజీ కుమారుడైన శంభాజీని ఔరంగజేబు బంధించి చిత్ర హింసలు పెట్టాడు. శంభాజీని తన మతంలోకి మారమని ఔరంగజేబు అడిగాడు. కానీ శంభాజీ దానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఔరంగజేబు శంభాజీని చాలా బాధపెట్టి, దారుణమైన హింసలకు గురిచేసి.. చివరికి ఉరితీసి చంపేశాడు. ఇలా ఎన్నో దారుణమైన పనులను ఔరంగజేబు చేసాడు. అయితే ఎన్నో దారుణాలు చేసినా ఔరంగజేబు చివరికి 1707లో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో మరణించాడు. అనంతరం మృతదేహాన్ని ఖుల్తాబాద్‌కు తరలించారు. అతని మరణానంతరం, ఔరంగజేబు తన గురువు సయ్యద్ జైనుద్దీన్ షిరాజ్ సమాధి పక్కనే తన సమాధి ఉండాలని తన వీలునామాలో రాశాడు. ఔరంగజేబు తన సమాధి ఎలా ఉండాలనుకుంటున్నాడో అతను వివరంగా రాశాడు. అయితే ఔరంగజేబు తాను సంపాదించిన డబ్బుతో తన సమాధిని నిర్మించాలని అలాగే దానిపై సబ్జా మొక్క నాటాలని పేర్కొన్నాడు. ఔరంగజేబు టోపీలు చేసేవాడు అలాగే షరీఫ్ రాశాడు. ఖుల్తాబాద్‌లోని అతని సమాధి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో నిర్మించబడింది. ఈ సమాధి కట్టడానికి 14 రూపాయల 12 అణాలు ఖర్చ చేసారు.

ఔరంగజేబు సమాధిపై సబ్జా మొక్క నాటారు. అయితే దానికి వెనుక ఒక చిన్న రహస్యం ఉంది. అది ఏంటంటే.. ఔరంగజేబు తాను జీవించి ఉన్నప్పుడు.. అతను రోజు షర్బత్ పానీయంలో సబ్జా గింజలు కలుపుకుని తాగేవారు. అది చలువ చేస్తుంది అని అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది అని ఔరంగజేబు రోజు తాగేవారు. ఈ క్రమంలోనే ఔరంగజేబు అతని సమాధిపై కూడా సబ్జా మొక్కను నాటాలని కోరారు. అందుకే అతని సమాధిపై సబ్జా మొక్క నాటారు. ఈ నేపథ్యంలోనే అంత క్రూరుడు ఔరంగజేబు సమాధిపై సబ్జా మొక్క నాటారు.

Recent

- Advertisment -spot_img