ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీంఇండియా 180 పరుగులకు ఆలౌట్ అయింది. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి 42 రన్స్ తో రాణించారు. రాహుల్ 37, గిల్ 31, అశ్విన్ 22, పంత్ 21, కోహ్లి 7, సిరాజ్ 4, రోహిత్ 3 రన్స్ చేశారు. జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు పడగొట్టగా బొలాండ్ 2, కమిన్స్ 2 వికెట్లు తీశారు.