Homeహైదరాబాద్latest NewsAUS vs IND: ఐదో టెస్టులో భారత్‌ ఓటమి.. సిరీస్‌ ఆసీస్‌దే..!

AUS vs IND: ఐదో టెస్టులో భారత్‌ ఓటమి.. సిరీస్‌ ఆసీస్‌దే..!

AUS vs IND: బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో భారత్‌ ఓటమి పాలైంది. ఆసీస్‌ 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 162 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఖవాజా 41, హెడ్‌ (34), వెబ్‌స్టర్‌ (39) సామ్‌ కొనస్టాస్‌ 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ 3, సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. కాగా వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా బౌలింగ్‌కు రాలేదు.

Recent

- Advertisment -spot_img