రెండో రోజు ఆటలో ఔటై పెవిలియన్ వైపు వెళ్తుండగా విరాట్ కోహ్లీని కొంతమంది ఆసీస్ ఫ్యాన్స్ అవమానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరిగి వెనక్కి వచ్చి కోపంగా ఆసీస్ ఫ్యాన్స్ వైపు కోహ్లీ చూశాడు. ఈ క్రమంలో భద్రతా అధికారి కోహ్లీని సముదాయించి లోపలికి తీసుకెళ్లాడు. ఆసీస్ ఫ్యాన్స్ హద్దులు మీరుతున్నారని భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు.