ఇదేనిజం, ధర్మపురి: రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉత్తమ రక్తదాత చింత సుదీర్ ను సన్మానించి ప్రశంషా పత్రం అందజేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన చింత సుదీర్ ఆయన మిత్ర బృందం జగిత్యాల చుట్టూ పక్కల యువత కొన్ని బ్లడ్ డోనార్స్ గ్రూప్ గా ఏర్పడి రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలలో ఏ సమయంలో అయిన రక్తం అవసరం అని సమాచారం తెలియగానే తన మిత్రులతో ఒకరి నుండి మరొకరికి సమాచారం చేరవేసుకొని రక్తదాతలను పంపి రక్తాన్ని అందించారు. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో 6 వేల మందికి పైగా రక్తన్నీ అందించి ప్రాణధాతగా నిలిచారు. స్వయంగా సుధీర్ 54 సార్లు రక్తదానం చేయగా ఈయన సేవలను గుర్తించి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని విరుపాక్షి గార్డెన్ లో చింత సుదీర్ ని సన్మానించి ప్రశంశ పత్రాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, డిఎంహెచ్ఓ ఇంచార్జ్ సమీఉద్దీన్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ప్రవీణ్, పోషక ఆహార నిపుణులు రిచా శ్రీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రెటరీ మంచాల కృష్ణ,టీవీ సూర్యం, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, జిల్లా ఉత్తమ రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.