ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన రేపల్లె సత్తన్న పత్తి చేనులో ఆదిత్య అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన మోక్ష పత్తి పంట క్షేత్రం పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన పలు గ్రామాల నుండి రైతులు ఈ మోక్ష పత్తి అవగాహన సదస్సులో పాల్గొని అధిక దిగుబడి ఏ విధంగా వస్తుందో తగు సూచనలు తెలుసుకున్నారు. మోక్ష పత్తి విత్తనాలు నాటడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, సంతోష్ కుమార్,డీలర్ భాగ్యలక్ష్మి ఫెర్టిలైజర్,రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.