ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామస్తులకు ఆయా శాఖల అధికారులు కుల వివక్ష సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలని సోషల్ వెల్ఫేర్ అధికారి కర్ణాకర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగిఉండాలని సూచించారు.నిమ్న జాతుల వారిని కించపరిచినట్లు మాట్లాడితే చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి రోజున గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తారని అన్నారు గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. వచ్చిన అధికారులను మాజీ సర్పంచ్ దేవేందర్ వారిని శాలువలతో సన్మానించారు . పౌర హక్కుల అవగాహన సదస్సులో చట్టాలపై తెలిపే పోలీస్ శాఖ లేకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ అధికారి కరుణాకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రఘు ఎంపీఓ బీరయ్య గ్రామ ప్రత్యేక అధికారి ఏఈ ఇమాయితుల్ల, మాజీ సర్పంచ్ భూక్య దేవేందర్ నాయక్, గ్రామ కార్యదర్శి బుగ్గ రాములు, పరశురాములు రాజయ్య అంగన్వాడి కార్యకర్త లు గ్రామస్తులు పాల్గొన్నారు.