IPL-2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఫ్రాంచైజీ ప్రకటించింది. గతంలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్ ప్రస్తుతం లక్నోకు నాయకత్వం వహిస్తున్నాడు. 2024 సీజన్‌లో అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించాడు. అతను 12 ఇన్నింగ్స్‌లలో 7.65 ఎకానమీ రేటుతో 11 వికెట్లు పడగొట్టడమే కాకుండా, 131.28 స్ట్రైక్ రేట్‌తో 235 పరుగులు కూడా చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని 16.50 కోట్లకు నిలుపుకుంది.
IPL-2025 జట్ల కెప్టెన్లు వీరే
సీఎస్‌కే – రుతురాజ్ గైక్వాడ్
ఆర్సీబీ – రజత్ పాటిదార్
ముంబై – హార్దిక్ పాండ్య
లక్నో – రిషభ్ పంత్
పంజాబ్ – శ్రేయస్ అయ్యర్
గుజరాత్ – శుభమన్ గిల్
రాజస్థాన్ – సంజూ శాంసన్
ఢిల్లీ – అక్షర్ పటేల్
హైదరాబాద్ – కమిన్స్
కేకేఆర్ – అజింక్యా రహానే.