ఇదేనిజం, ఎండపల్లి: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూర్ గ్రామంలో శనివారం రోజున అయోధ్య రాముని అక్షింతల ఊరేగింపు కార్యక్రమం స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని ఆడపడుచులు హారతి పట్టి గ్రామంలోకి స్వాగతించారు. ఈ అక్షింతలను ఊరి పొలిమేరలోని పాటి హనుమాన్ వద్ద నుండి ఊరేగింపుగా ఊరిలోని వాడవాడనా భజన కార్యక్రమంతో తీసుకువెళ్లారు. కార్యక్రమంలో సర్పంచ్ కొంగల జగదీశ్వర్ రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి, ఎంపిటిసి లక్కాకుల రాణి – శ్రీనివాస్, గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు కోట శ్రీశైలం, కొయ్యడ ఓదేలు, అయోధ్య తీర్థ క్షేత్ర కమిటీ సభ్యులు మేడిపెల్లి రామాంజనేయులు, ఆకుల మధుసూదన్, బొల్లం శ్రీకాంత్, జక్కుల సాగర్, అమ్ముల సతీష్,నిమ్మ నరేష్, కొయ్యడశ్రావణ్, మేడిపల్లి శ్రీనివాస్, రామభక్త హనుమాన్ నాటక మండలి సభ్యులు కోట కుమార్, వుష్కమల్ల సత్యనారాయణ, సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.