ఇదేనిజం, ఆత్మకూరు: శ్రీరామ జన్మభూమి పూజిత అక్షితల వితరణ కార్యక్రమం జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆత్మకూరు మండల వ్యాప్తంగా శ్రీ రామ పూజిత అక్షితలను వితరణ చేస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందాల చందర్ బాబు తెలిపారు. ఆత్మకూరు మండలం సమావేశంలో నందాల చందర్ బాబు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలోని గర్భగుడిలో శ్రీ బాల రాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ గావించినున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అయోధ్య అంగరంగ వైభవంగా ముస్తాబుకానుందన్నారు. సమావేశంలో మండల సమ్యోజక్ గా టింగిలికారి సత్యనారాయణ, సహ సంయోజక్ గా నాగబండి శివప్రసాద్ ను నియమించారు. కార్య క్రమంలో వంగాల బుచ్చి రెడ్డి, ఉప్పునూతుల శంకర్ జీ, తదితరులు పాల్గొన్నారు.