Mucormycosis Black Fungus Treatment : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ- ఆయుష్ విభాగం, డాక్టర్ బూర్గుల రామకృష్ణా రావు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల సంయుక్తంగా ఓ పరిశోధనకు శ్రీకారం చుట్టాయి.
black fungus ayurvedic treatment
దేశంలోనే తొలిసారిగా, బ్లాక్ ఫంగస్ నివారణకు ఆయుర్వేద ఔషధాలతో కూడిన చికిత్సా విధానాన్ని ఆవిష్కరించాయి.
గాంధీ, ఈఎన్‌టీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని బ్లాక్ ఫంగస్ రోగులకు ప్రయోగాత్మకంగా ఆ మందులను ఇచ్చారు. ఆ ప్రయత్నం సానుకూల ఫలితాలను ఇచ్చింది.
black fungus ayurvedic treatment
దీంతో చికిత్సా విధానాన్ని, అధ్యయన ఫలితాలను ప్రభుత్వానికి నివేదించేందుకు ఆయుష్ విభాగం సిద్ధమవుతున్నది. త్వరలోనే జర్నల్ ప్రచురణకూ వెళ్లనున్నది.
మూడు నెలల అధ్యయనం
బ్లాక్ ఫంగస్ కేసులు అత్యధికంగా ఉన్న కాలం.. మే నుంచి ఆగస్టు. ఈ సమయంలో గాంధీ, కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రుల్లో ఈ అధ్యయనం నిర్వహించారు.
black fungus ayurvedic treatment
ఇందుకోసం గాంధీ దవాఖానలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ తీవ్ర లక్షణాలు ఉన్న వారిని, ఈఎన్‌టీ ఆసుపత్రిలో సాధారణ స్థాయి నుంచి ఓ మోస్తరు తీవ్రతతో బాధపడుతున్న బ్లాక్ ఫంగస్ బాధితులను ఎంపిక చేసుకున్నారు. నూతన చికిత్సా విధానం గురించి రోగులకు, వారి కుటుంబ సభ్యులకు వివరించి అంగీకారం తీసుకున్నారు. Mucormycosis Black Fungus Treatment
black fungus ayurvedic treatment
చికిత్సలో భాగంగా అల్లోపతి మందులు కొనసాగిస్తూనే, ఆయుర్వేద ఔషధాలను (యాడ్ ఆన్ థెరపీ విత్ అల్లోపతి) అందించారు. గాంధీలో 45 మందిపై, ఈఎన్‌టీలో 92 మందిపై ఈ అధ్యయనం జరిగింది.
ప్రతి రోగికీ నిత్యం వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, ప్రతి చిన్న మార్పునూ నమోదు చేశారు. మొత్తం ఎనిమిది మార్గదర్శకాలను ఖరారుచేసుకొని.. దానికి అనుగుణంగా నివేదిక రూపొందించారు.
black fungus ayurvedic treatment
రోగిలో బ్లాక్ ఫంగస్ వ్యాప్తి ఏ మేరకు ఉంది, మందులు ఎలా పని చేస్తున్నాయి, దుష్ప్రభావాలు కనిపించాయా, చికిత్స తర్వాత మళ్లీ ఎంతమంది అడ్మిట్ అయ్యారు, ఎంతమందికి మళ్లీ సర్జరీ జరిగింది, మరణాల రేటు ఏ స్థాయిలో ఉంది, వ్యాధి లక్షణాలు ఏమిటి.. అన్నది లోతుగా పరిశీలించారు. ఆ గణాంకాల ఆధారంగా చికిత్స సామర్థ్యాన్ని శాస్త్రీయంగా విశ్లేషించారు. M
ఒక్క మరణమూ లేదు
అధ్యయనంలో భాగంగా అల్లోపతితో పాటు ఆయుర్వేద మందులు తీసుకున్న రెండు ఆసుపత్రుల్లోని రోగులలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి పదమూడు వందల మంది బ్లాక్ ఫంగస్ రోగులున్నారు.
వీరంతా కొవిడ్‌తో పాటు వివిధ దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారే.
black fungus ayurvedic treatment
ఇందులో ప్రతి వంద మందిలో పది మందికి పక్షవాతం వచ్చింది, పది మంది కళ్లు కోల్పోయారు, పది మందికైతే మెదడు వరకు బ్లాక్ ఫంగస్ సోకింది. ఇలాంటి వారు సైతం ఆయుష్ అధ్యయనంలో భాగమయ్యారు. అందరూ మృత్యువును జయించారు.
కొందరిలో మాత్రం స్వల్ప స్థాయి దుష్ప్రభావాలు కనిపించాయి. చాలామందికి ఆయుష్ ఔషధాల వల్ల ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు.
black fungus ayurvedic treatment
సరికదా, మందులు వాడిన తర్వాత వ్యాధి విస్తరణ తగ్గిపోయింది. ఫంగల్ ప్రభావం వేగంగా క్షీణించింది. బ్లాక్ ఫంగస్ లక్షణాల నుంచి ఉపశమనమూ లభించింది. డిశ్చార్జి తర్వాత ఎవరూ మళ్లీ ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా పోయింది.
black fungus ayurvedic treatment
ఈ సత్ఫలితాల నేపథ్యంలో ఆయుర్వేదం వాడేవారు.. బ్లాక్ ఫంగస్ సర్జరీ తర్వాత, రెండు నెలల పాటు వేసుకోవాల్సిన పొసకొనజోల్ అనే అల్లోపతి మందు వినియోగాన్ని తగ్గించాల్సి ఉంటుందని కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి ఆదేశాలు జారీ చేసింది. Mucormycosis Black Fungus Treatment
తగ్గిన ఖర్చు…
ఒక్కో బ్లాక్ ఫంగస్ రోగి చికిత్స కోసం ప్రభుత్వం కనీసం రూ.15 లక్షల దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నది. సర్జరీ కాకుండా లైఫోసోమల్ ఆంఫోటెర్సిన్, ఆంఫోటెర్సిన్-బి, పొసకొనజోల్ వంటి మందుల కోసం మరికొన్ని లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది.
అయినా, బ్లాక్ ఫంగస్ పూర్తిగా తగ్గిపోయిందని నిర్ధారించలేం. చాలా మంది.. మళ్లీ మళ్లీ సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
black fungus ayurvedic treatment
ముక్కులో మొదలైన బ్లాక్ ఫంగస్ కళ్లు, దవడ, మెదడు వరకూ వ్యాపిస్తుంది. తాజా ఆయుర్వేద చికిత్సా విధానం వల్ల .. దుష్ప్రభావాలకు ఆస్కారం ఉన్న అల్లోపతి మందుల వాడకం కూడా గణనీయంగా తగ్గింది. మళ్లీ ఆసుపత్రికి రావాల్సిన ఇబ్బందీ తప్పుతున్నది. దీంతో ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు ఆర్థిక భారం తగ్గనున్నది.
బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం కేవలం అల్లోపతి మందులే వాడటం వల్ల దీర్ఘకాలంలో రోగి శరీర వ్యవస్థకు నష్టం వాటిల్లే ఆస్కారం ఉంది.
కానీ, ఆయుర్వేదం జోడించడం వల్ల ఆ చెడు ప్రభావాలు తొలగిపోతాయి. బ్లాక్ ఫంగస్ మాత్రమేనా, వివిధ రుగ్మతలకు అల్లోపతి మిళితమైన ఆయుర్వేద పరిష్కారాలు కనుగొనే దిశగా ఇదో ముందడుగు. Mucormycosis Black Fungus
black fungus ayurvedic treatment Treatment
బ్లాక్ ఫంగస్ నివారణలో..
బ్లాక్ ఫంగస్‌కు నూతన చికిత్సా విధానాన్ని కనుగొనడమే కాదు, అంతకుముందే బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు వివిధ సూచనలు చేసింది ఆయుష్ విభాగం.
కరోనా సోకిన వాళ్లంతా బ్లాక్ ఫంగస్ వస్తుందేమోననే భయంతో వణికిపోతున్న వేళ ఇవి ఎంతో ఊరటనిచ్చాయి. సామాన్యులకు తగినంత స్పష్టతనిచ్చాయి.
black fungus ayurvedic treatment
కొవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ వాడినవారు, అప్పటికే మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించింది.
సంశమనవటి, నిషామలకివటి, సుదర్శన ఘనవటి మాత్రలను మూడు పూటలా తీసుకోవడం వల్ల బ్లాక్ ఫంగస్ బారి నుంచి తమనుతాము కాపాడుకోవచ్చని స్పష్టం చేసింది.
black fungus ayurvedic treatment
దీంతో పెద్ద మొత్తంలో ఈ మందులకు డిమాండ్ ఏర్పడింది. సామాజిక బాధ్యతగా వేల కిట్లను ఉచితంగా పంపిణీ చేసింది ఆయుష్.
భారతీయ వైద్య విధానంలో విప్లవాత్మకమైన మార్పుల వైపుగా ఆయుష్ తొలి అడుగు ఇది. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసే రోజు ఎంతో దూరం లేదు. Mucormycosis Black Fungu
black fungus ayurvedic treatment s Treatment
అధ్యయన బృందం
ఈ అధ్యయనంలో గాంధీ ఆసుపత్రి బృందానికి డాక్టర్ శంకర్ ప్రసాద్, డాక్టర్ అనసూయ; కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి బృందానికి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మడికొండ, సీహెచ్ రమాదేవి నేతృత్వం వహించారు.
ఆయుష్ విభాగం డైరెక్టర్ డాక్టర్ వీఎస్ అలగు వర్షిణి, డాక్టర్ బూర్గుల రామకృష్ణా రావు ఆయుర్వేద మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు, కొందరు పీజీ విద్యార్థులు ఇందులో పాలుపంచుకున్నారు.
black fungus ayurvedic treatment
అధ్యయన సమయంలో పలువురు పీజీ విద్యార్థులు కరోనా బారినపడ్డారు. Mucormycosis Black Fungus Treatment
అధ్యయన ఫలితాలు
కోఠి ఈఎన్‌టీలో..
- కనీసం 30 రోజులు ఆయుర్వేద ఔషధాలు వాడిన రోగుల్లో వ్యాధి తీవ్రత స్వల్పంగానే
- కనిపించింది. తక్కువ సమయంలోనే
- ఉపశమనం లభించింది.
- ఆయుర్వేద-అల్లోపతి.. రెండిటినీ ఉపయోగించిన రోగుల్లో కన్ను, పన్ను, నాడీ వ్యవస్థలకు సంబంధించిన సమస్యలు చాలా తక్కువగా ఉండటం గమనించారు.
- రెండు విధానాల మందులు కలిపి వాడినా దుష్ప్రభావాలు కన
- బడలేదు. రక్త పరీక్షల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. స్వల్ప వ్యవధిలోనే యాంటీ ఫంగల్ ఇంగ్లిష్ ఔషధాల అవసరమూ తగ్గింది.
గాంధీ ఆసుపత్రిలో..
- కొవిడ్ పాజిటివ్ తీవ్ర లక్షణాలతోపాటు బ్లాక్ ఫంగస్ బాధిస్తున్న రోగులకు ఆయుష్ మందులు ఇవ్వడం జరిగింది. వారిలో దాదాపు అందరూ పూర్తి స్థాయిలో కోలుకున్నారు.
- వ్యాధి శరీరంలోని ఒక భాగం నుంచి మరొక భాగానికి వ్యాప్తి చెందడం ఆగిపోయింది.
- అతికొద్ది మందిలో స్వల్ప స్థాయి దుష్ప్రభావాలు నమోదు అయినా.. మిగతా వారిలో ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు.