దేశంలోని ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని అందించడానికి ఆయుష్మాన్ భారత్ యోజన అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కీమ్‌కి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ స్కీమ్‌ను పొందుతున్నప్పుడు ప్రజలు ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా గూగుల్ సహకారంతో సులభం అయ్యేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. దీంతో ప్రజలు గూగుల్‌లోనే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్‌ను పొందొచ్చు. త్వరలో ఈ హెల్త్ కార్డ్‌లు Google Walletలో అందుబాటులోకి రానున్నాయి.