Homeహైదరాబాద్latest Newsబాబోయ్ ప్రయి'వేటు' పాఠశాల.. విద్య హక్కు చట్టమా నీవెక్కడ..?

బాబోయ్ ప్రయి’వేటు’ పాఠశాల.. విద్య హక్కు చట్టమా నీవెక్కడ..?

  • సదువు సారేడు.. ఫిసులు బారేడు..
  • అరకొర చదువుతో ప్రయివేట్ ఉపాధ్యాయులు..
  • ఉన్నత అధికారుల పర్యవేక్షణ కరువు..
  • విద్య అంగట్లో వ్యాపారమేనా..
  • పుస్తకాలతో పాటు అన్ని పాఠశాలలో అందుబాటులో..
  • ఎం ఆర్ పి కంటే అధిక రేటుకు అమ్మకాలు..
  • ఆకర్షనియమైన ఆఫర్ లు..
  • సౌకర్యాలు లేవు.. సార్లు కన్నీతి చూడరు..
  • విద్యాశాఖ అలసత్వం విద్యార్థులకు శాపమేనా..

ఇదేనిజం, ధర్మపురి/ఎండపల్లి: సదువు సారేడు ఫిసులు బారేడు అన్నట్లు ఉంది ప్రయివేటు పాఠశాల తీరు. ఉన్నత చదువులు అంగట్లో అందుబాటులో ఉన్నాయి అన్నట్లు ఉంది ప్రయివేటు పాఠశాలల పనితీరు. జగిత్యాల జిల్లా ఎండపల్లి, ధర్మారం మండలల్లో ప్రయివేటు పాఠశాలల దందా మూడు పువ్వులు అరుకాయలుగా సాగుతుంది. ఉన్నత చదువులు విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారాయి. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తను పెట్టింటే సిద్ధాంతం అంటూ అధిక ఫిసులు వాసులు చేస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులకు పెను భారంగా మారింది. స్కూల్ మొదలు అడ్మిషన్ ల పేరుతొ వేలకు వెలు వాసులు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిబంధానల ప్రకారం పాఠశాలలో బుక్స్ అమ్మకూడదని ఆదేశాలు ఉన్న తమకేమి పట్టనట్లు ఎం ఆర్ పి కి మించి ఇష్టను సారంగా బుక్కులు అమ్ముతు లక్షలు గాడిస్తున్నారు.

స్కూల్ యూనిఫామ్ లతో పాటు టై లు, బెల్ట్ లు, షు లు అన్ని అంగట్లో అందుబాటులో ఉన్నాయంటూ పవిత్ర పాఠశాలను అంగడి సంతగా మారుస్తున్నారు. ఇదంతా తెలిసిన విద్యాశాఖ అధికారులు సైతం తమకేమి పట్టనట్లు వ్యవహరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ గోడును ఎవ్వరికో చెప్పుకోవాలో తెలియక శతమాతమౌతున్నారు.మరోవైపు ఉన్నత చదువులకై ప్రభుత్వ గురుకుల, నవోదయ ఎంట్రెన్స్ పరీక్షలు రాసినా విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలలో టిసి కోరగా దానికి సైతం వేలల్లో డబ్బులు వాసులు చేస్తున్నారు.నిరుపేద కుటుంబనికి చెందిన విద్యార్థులను ప్రభుత్వం గుర్తించి నవోదయ, గురుకుల వంటి పాఠశాలల్లో సిటు అందించిన ప్రయివేట్ పాఠశాలల చేతివటం వల్ల అధికాస్త తల్లిదండ్రులకు శాపంగానే మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనికి తోడు ప్రయివేటు పాఠశాలలో మొత్తం ఒక్కసారిగా కడితే 10% డిస్కౌట్ అంటూ ఆఫర్ లు సైతం పెడుతున్న అధికారులు మాత్రం అటు వైపు కన్నీతి చూడటం లేదు. ఒక్కవైపు తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలలు అందుబాటులో ఉండాలని నిర్దేశిత ఫిసులను అందుబాటులో ఉంచాగా విద్యాశాఖ అలసత్వం వల్ల అధికాస్తా అందని ద్రాక్షగానే మారింది.మరోవైపు పరిమితికి మించి ఆటోలు టాటా ఏసీ లు, బస్సులల్లో విద్యార్థులను తీసుకుని వస్తు ప్రమాదలు జరిగిన విద్యార్థుల ప్రాణాలను గాలిలో దీపాలుగా మారుస్తున్నారు.ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img