డిస్నీ యొక్క ప్రసిద్ధ పిల్లల సినిమాలలో ఒకటి ‘ది లయన్ కింగ్’. ఈ సినిమా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ వచ్చింది. నేడు విడుదలైన ‘ముఫాసా ది లయన్ కింగ్’ సినిమాచూసేందుకు మహేష్ బాబు అభిమానులు ఉదయాన్నే థియేటర్లకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు సింహం బదులుగా పిల్లను తీసుకెళ్లి థియేటర్ ముందు సందడి చేసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.