బాబూ.. ఇది కాదా రాక్షస పాలన అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ చంద్రబాబును ట్విట్టర్ వేదికగా పోస్టులతో వెంటాడుతోంది. మొన్నటిదాకా ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జా చేసిన పచ్చ నాయకులు ఇప్పుడు సివిల్ వర్క్స్, నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనా ట్విట్టర్లో ఇరు పార్టీల మధ్య వార్ ఓ రేంజ్లో కొనసాగుతోంది.