ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ సంఘం ఆధ్వర్యంలో కొలువు దీరిన వినాయకుణ్ణి ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు,బాబు జగ్జీవన్ రామ్ సంఘ సభ్యులు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు.అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.