Homeహైదరాబాద్latest News‘పుష్ప2’ మూవీకి ఎదురుదెబ్బ.. కుప్పంలో థియేటర్లు సీజ్..!

‘పుష్ప2’ మూవీకి ఎదురుదెబ్బ.. కుప్పంలో థియేటర్లు సీజ్..!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప2’. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలై రికార్డులు బద్దలుకొడుతుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ క్రమంలో ‘పుష్ప2’ మూవీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కుప్పంలో ‘పుష్ప-2’ ప్రదరిస్తున థియేటర్లును రెవెన్యూ అధికారులు సీజ్ చేసారు. కుప్పంలోని లక్ష్మి, మహాలక్ష్మి థియేటర్లను లైసెన్స్ రెన్యూవల్ చేసుకోకుండా, NOC తీసుకోకుండా సినిమా ప్రదర్శిస్తున్నారంటూ ఆ థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేసారు.

Recent

- Advertisment -spot_img