Homeహైదరాబాద్latest NewsAnimal సినిమా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్

Animal సినిమా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్

యానిమల్ మూవీ సీక్వెల్ ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి దీనిపై స్పష్టతనిచ్చారు.
రణబీర్ కపూర్-రష్మిక మందన జంటగా నటించిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ సినిమాకి బాలీవుడ్ ఆడియన్స్ పిచ్చెక్కిపోయారు. ఇక దీనికి సీక్వెల్‌‍గా రాబోతున్న యానిమల్ పార్క్ గురించి అంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే పరిస్థితి కనిపించట్లేదు.
స్పిరిట్‌ని పూర్తి చేసిన తర్వాతే యానిమల్ పార్క్‌పై దృష్టి పెట్టాలని సందీప్ రెడ్డి అనుకుంటున్నారట. ఇంతలో రణబీర్ కపూర్ కూడా తాను కమిట్ అయిన ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేస్తారని సమాచారం. ఇక యానిమల్ పార్క్‌లో రణబీర్ డ్యుయెల్ రోల్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక రష్మిక మందన, త్రిప్తి డిమ్రి క్యారెక్టర్లు కూడా పార్ట్ 2లో కొనసాగబోతున్నాయి. అయితే యానిమల్ పార్క్ వచ్చే ఏడాది వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనుహ్యంగా ప్రభాస్ ప్రాజెక్ట్ ముందుకు రావడంతో సందీప్ స్పిరిట్ పనులు మొదలుపెట్టేశారు. ఈ చిత్రాన్ని ఏడాది లోపు పూర్తి చేసి రిలీజ్ చేయాలని సందీప్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కూడా సందీప్ రెడ్డి ఒక మూవీ చేయాల్సి ఉంది. ఇది కూడా ఎప్పుడో కమిట్ అయిందే. కానీ పుష్ప సిరీస్‌తో బన్నీ బిజీగా ఉండటంతో సందీప్ రెడ్డి యానిమల్ సినిమా తీశారు. ఇప్పుడు పుష్ప 2 రిలీజైన తర్వాత డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డికి ఖాళీ ఉంటే బన్నీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. కానీ సందీప్ రెడ్డికి 2026 వరకూ ఖాళీ లేదు కాబట్టి ఆ తర్వాతే వీళ్ల కాంబోలో సినిమా రావచ్చు. ఇంతలో బన్నీ కూడా అట్లీ, త్రివిక్రమ్‌లతో సినిమాలు పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవిని కూడా డైరెక్ట్ చేయాలని ఉందంటూ గతంలో ఒకసారి సందీప్ రెడ్డి చెప్పారు. మరి ఇది వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

Recent

- Advertisment -spot_img