దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను కేంద్రం బ్యాడ్‌న్యూస్ చెప్పింది. నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. దీని ద్వారా ఇకపై 5 నుంచి 8 తరగతుల విద్యార్థులను ఫెయిల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని రద్దుచేయడంతో 5 నుంచి 8 తరగతుల విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సిఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది.