Homeహైదరాబాద్latest Newsబడే భాయ్‌తో భేటీని బహిష్కరించిన చోటే భాయ్‌.. ఎక్స్‌ వేదికగా కేటీఆర్ సెటైర్లు.. ఏమన్నారంటే..?

బడే భాయ్‌తో భేటీని బహిష్కరించిన చోటే భాయ్‌.. ఎక్స్‌ వేదికగా కేటీఆర్ సెటైర్లు.. ఏమన్నారంటే..?

ప్రధానితో భేటీని బహిష్కరిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనపై కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా పెట్టిన తర్వాత గతంలో బీఆర్‌ఎస్‌ ప్రధాని ఎందుకు కలవలేదో, నీతి ఆయోగ్‌ సమావేశాలకు కేసీఆర్‌ ఎందుకు వెళ్లలేదో కాంగ్రెస్‌ వాళ్లకు తెలిసి వచ్చింది. గతంలో మేము చెప్పిన విషయాలే వాస్తవమని తేలింది. నాడు బీఆర్‌ఎస్‌ అనుసరించిన విధానాలనే ఇప్పుడు కాంగ్రెస్‌ అంగీకరిస్తుందన్నారు. రేవంత్‌ రెడ్డి తనకు తాను నీతి ఆయోగ్‌ మీటింగ్‌ను బహిష్కరిస్తున్న దానికి కాంగ్రెస్‌ ఏం సమాధానం చెబుతుంది? రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్‌ అంశాలపై పెద్దన్న ప్రధానితో మాట్లాడటానికి చోటే భాయ్‌ ఎందుకు కలవడం లేదు?’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Recent

- Advertisment -spot_img