Homeహైదరాబాద్latest Newsగొల్లపల్లిలో బడిబాట ర్యాలీ

గొల్లపల్లిలో బడిబాట ర్యాలీ

ఇదే నిజం, గొల్లపల్లి: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గోల్లపల్లి పాఠశాలలో మొదటి రోజున అమ్మ ఆర్గనైజర్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడం కొరకు చర్చించడం జరిగింది. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, స్వయం సహాయక సంఘాలు, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్స్ తో బడిబాట ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కందుకూరి గంగారెడ్డి, భోగ శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఏసుమణి, కమిటీ సభ్యులు, స్వయం సహాయక సంగం సభ్యులు, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్, అంగన్వాడీ టీచర్స్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img