దిల్లీ : బెయిల్ విషయంలో ట్రయల్ కోర్టుకే వెళ్లాలని ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) సుప్రీంకోర్టు సూచించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని వ్యాఖ్యానించింది. దిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుతం కేసు మెరిట్స్‌లోకి వెళ్లలేమని స్పష్టం చేసింది. పిటిషన్‌లోని అంశాలపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపైనే దాఖలైన మరో పిటిషన్‌తో కలిపి విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.