Homeహైదరాబాద్latest Newsఈ నెల 27న కవితకు బెయిల్..? ఇప్పటికే పలుమార్లు వాయిదాల పర్వం.. ఆశాభావంలో బీఆర్ఎస్​ వర్గాలు..!

ఈ నెల 27న కవితకు బెయిల్..? ఇప్పటికే పలుమార్లు వాయిదాల పర్వం.. ఆశాభావంలో బీఆర్ఎస్​ వర్గాలు..!

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్​ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 27న బెయిల్​ వస్తుందని బీఆర్​ఎస్​ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా కోర్టు అనుమతితో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. అప్పటి నుంచి కవిత తీహార్​ జైలులోనే ఉన్నారు. ఈ కేసులో ఛార్జ్ షీట్లు కూడా వేశారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్​ నేత మనీష్ సిసోడియాను సైతం సీబీఐ అరెస్ట్ చేసింది. లిక్క‌ర్ పాల‌సీ ఈడీ కేసులో ఇప్ప‌టికే కేజ్రీవాల్‌కు బెయిల్ వ‌చ్చింది. గతేడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన మనీష్​ సిసోడియాకు కొద్ది రోజుల క్రితమే ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్​ లభించింది. ఈ క్రమంలో కవిత, కేజ్రీవాల్​లకు కూడా బెయిల్​ వస్తుందని అంతా భావిస్తున్నారు. కాగా, ఇంత వరకు సీబీఐ, ఈడీ కేసుల్లో వ్యక్తుల వాంగ్మూలాలే తప్ప కవితకు ప్రత్యక్షంగా ముడుపులు ముట్టినట్టు రికార్డు మీద ఎక్కడా ఆధారాలు చూపించలేదు. అనారోగ్యం కారణంగా తనకు బెయిల్​ మంజూరు చేయాలని కవిత పిటిషన్​ దాఖలు చేయగా ఇటీవల ఆగస్టు 20న కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కవిత బెయిల్‌పై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసినా ఈడీ చేయలేదు. కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీ సమయం కోరగా కోర్టు అనుమతిస్తూ విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది. ఇప్పటికే పలు మార్లు విచారణ వాయిదా పడిన క్రమంలో ఈసారి తప్పకుండా కవితకు బెయిల్​ వస్తుందని బీఆర్ఎస్​ పార్టీలో చర్చ నడుస్తోంది.

Recent

- Advertisment -spot_img