Homeహైదరాబాద్latest Newsరేపు కవితకు బెయిల్?.. ఢిల్లీ బాట పట్టిన బీఆర్ఎస్ లీడర్లు.. కేటీఆర్, హరీష్ లు కూడా..!

రేపు కవితకు బెయిల్?.. ఢిల్లీ బాట పట్టిన బీఆర్ఎస్ లీడర్లు.. కేటీఆర్, హరీష్ లు కూడా..!

ఢిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్​ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రేపు బెయిల్​ వస్తుందని బీఆర్​ఎస్​ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్​ నేత మనీష్ సిసోడియాను సైతం సీబీఐ అరెస్ట్ చేసింది. లిక్క‌ర్ పాల‌సీ ఈడీ కేసులో ఇప్ప‌టికే కేజ్రీవాల్‌కు బెయిల్ వ‌చ్చింది. గతేడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన మనీష్​ సిసోడియాకు కొద్ది రోజుల క్రితమే ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్​ లభించింది. ఈ క్రమంలో కవితకు బెయిల్​ వస్తుందని అంతా భావిస్తున్నారు. అంతే కాకుండా ఆమె హెల్త్ కండిషన్ కూడా బాగా లేని కారణంగా బెయిల్ రావడం ఖాయం అంటున్నారు. ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆపార్టీ నేత హరీశ్ రావు, ఆపార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం ఢిల్లీకి బయలుదేరవెళ్లనున్నారు. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ జరపనున్నారు. ఐదు నెలల పాటు కవిత జైళ్లో ఉండటంతో ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు దీమా వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img