Homeహైదరాబాద్latest Newsబలగం వేణు 'ఎల్లమ్మ' సినిమాకి హీరో కరువు

బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకి హీరో కరువు

కమెడియన్ వేణు తన సినీ కెరీర్ లో.. జై, రణం, దొంగల బండి, మున్నా, కంత్రి వంటి సినిమాలలో కామెడీ పాత్రలోతో జనాలని అలరించాడు. ఆ తరువాత దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు ‘బలగం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇపుడు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ తో ఇప్పటికే వేణు ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. తెలంగాణ నేప‌థ్యంలో మాస్, యాక్ష‌న్ జాన‌ర్‌లో సాగే క‌థ‌తో ఎల్లమ్మ స్క్రిప్ట్ సిద్ధ‌మైన‌ట్లు వినికిడి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని రూపొందించేందుకు దిల్ రాజు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమాకి హీరో ఎవరన్నది మాత్రం వేణు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే ముందుగా ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని హీరోగా కన్ఫర్మ్ అయిన .. ఆ తరువాత నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఈ సినిమాలో హీరోగా నితిన్ పేరు కూడా వినిపించింది…ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందని అనుకుంటే.. నితిన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకునట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై మరో ప్రచారం మొదలైంది. ‘హనుమాన్’ ఫేమ్ తేజ సజ్జతో ఈ సినిమా చేయాలని వేణు ప్రయత్నిస్తున్నాడు .తాజాగా తేజ సజ్జకు వేణు కథ చెప్పాడని టాక్ వినిపిస్తోంది. అయితే తేజ కూడా సినిమా చేస్తాననే క్లారిటీ ఇవ్వలేదు.ఆయన కాకపోతే వేణు ఎవరితో చేస్తాడో చూడాలి.

Recent

- Advertisment -spot_img