Homeఫ్లాష్ ఫ్లాష్Balakrishna cine hero:బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా 'NBK 109'

Balakrishna cine hero:బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ‘NBK 109’

Balakrishna cine hero:గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ భారీ బ్లాక్ బస్టర్లను అందిస్తూ తన అభిమానులను ఎంతగానోఅలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో బ్లాక్ బస్టర్ అందించాలని, ఓ భారీ యాక్షన్ చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ తో చేతులు కలిపారు.బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి, సూర్యదేవర నాగవంశీ పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను అధికారికంగా ప్రకటించి చిత్ర పనులు ప్రారంభించారు.బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు(జూన్ 10) నిర్వహించిన పూజా కార్యక్రమంలో స్క్రిప్ట్‌ను బడా మాస్ దర్శకుడు వి.వి. వినాయక్ తన చేతుల మీదుగా చిత్ర బృందానికి అందజేశారు. దక్షిణ కొరియా గౌరవ కౌన్సెల్ జనరల్ చుక్కపల్లి సురేష్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు.

c707d3c1 abba 4dcc 8515 0ad01212384b ఇదేనిజం Balakrishna cine hero:బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా 'NBK 109'

విజయవంతమైన దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచాన్ చేశారు. మొదటి షాట్ కి మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో తెలిపేలా కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మద్యం సీసా, గొడ్డలి, ఇతర పదునైన ఆయుధాలతో కథానాయకుడి పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతుందో తెలియజేశారు. కాన్సెప్ట్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగేలా చేసింది చిత్ర బృందం.”వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్” అనే లైన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో వివరించారు. అలాగే “ప్రపంచానికి అతను తెలుసు.. కానీ అతని ప్రపంచం ఎవరికీ తెలియదు” అంటూ పోస్టర్ పై రాసున్న సినిమా ట్యాగ్‌లైన్ ఆకట్టుకుంటోంది.

e139af4d c0b0 4023 b425 323ccf7e1cec ఇదేనిజం Balakrishna cine hero:బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా 'NBK 109'

ఈ రెండు లైన్స్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది చిత్ర బృందం. అభిమానులకు, సినీ ప్రియులకు థియేటర్లలో గొప్ప అనుభూతిని ఇచ్చే సినిమా అవుతుందని చిత్ర బృందం చెబుతోంది.ఈ చిత్రాన్ని 2024 ప్రారంభంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. మరిన్ని వివరాలను చిత్ర బృందం త్వరలో ప్రకటించనుంది.

Recent

- Advertisment -spot_img