Homeహైదరాబాద్latest Newsబాలకృష్ణ ''డాకు మహారాజ్'' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. ఎందుకంటే..?

బాలకృష్ణ ”డాకు మహారాజ్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. ఎందుకంటే..?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ”డాకు మహారాజ్”. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపురంలో గురువారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. అయితే తాజాగా ఈ ఈవెంట్‌ను రద్దు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. తిరుపతిలో బుధవారం జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుమల ఘటన నేపథ్యంలో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో వెల్లడించింది.ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యాన‌ర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

Recent

- Advertisment -spot_img