Homeహైదరాబాద్latest Newsఅల్లుఅర్జున్‌కి ఆరు నెలల సమయం ఇచ్చిన బాలకృష్ణ..! ఎందుకంటే..?

అల్లుఅర్జున్‌కి ఆరు నెలల సమయం ఇచ్చిన బాలకృష్ణ..! ఎందుకంటే..?

నందమూరి నట సింహం బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ అనే రియాల్టీ షోను విజయవంతంగా హోస్ట్ చేస్తున్నాడు. అల్లుఅర్జున్ ‘పుష్ప 2’ మూవీ త్వరలో విడుదల కానుంది. ఇటీవలే ‘అన్ స్టాపబుల్’ షోకి ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. అయిత్ ఈ షోలో అల్లుఅర్జున్ ని బాలకృష్ణ ఒక ఆసక్తికర ప్రశ్న అడిగారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ గురించి ఏమి అనుకుంటున్నావు అని అడిగారు.దానికి అల్లు అర్జున్ బదులిస్తూ.. “అతను నా ఫేవరెట్ యాక్టర్.. బాలీవుడ్ బెస్ట్ యాక్టర్లలో ఒకడు.. ఆయన్ను నేను చాలా అభిమానిస్తాను. వెంటనే బాలకృష్ణ ఏ మాత్రం ఆలోచించకుండా మీరిద్దరూ కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది అని అడగ్గా, అల్లు అర్జున్ అఫ్ కోర్స్ గ్రేట్ సార్ అని అన్నారు. మీ కోసం ఎవరూ స్క్రిప్ట్ రాయకపోతే, నేను మీకు కథ రాస్తాను అని బాలకృష్ణ అన్నారు. మీకు నేను ఆరు నెలలు సమయం ఇస్తున్నాను అని అన్నారు.ఈలోపు ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయకపోతే నేనే డైరెక్ట్ చేస్తా అని బాలకృష్ణ అన్నారు. దీంతో బాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img