Homeహైదరాబాద్latest Newsబాలయ్య హీరోయిన్‌కు లైంగిక వేధింపులు.. ప్రముఖ బంగారం వ్యాపారవేత్త అరెస్ట్..!!

బాలయ్య హీరోయిన్‌కు లైంగిక వేధింపులు.. ప్రముఖ బంగారం వ్యాపారవేత్త అరెస్ట్..!!

మలయాళ హీరోయిన్ హనీరోజ్ ను తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌ను కొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు (బుధవారం) ఉదయం వాయనాడ్‌లోని ఓ ఎస్టేట్‌లో బాబీని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. కొచ్చి సెంట్రల్ పోలీసులు బాబీపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 75 సహా పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ కేసుకు సంబంధించి హనీరోస్ మంగళవారం కొచ్చి సెంట్రల్ పోలీస్ స్టేషన్‌ను స్వయంగా సందర్శించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 30 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే మలయాళ హీరోయిన్ హనీరోజ్ బాలకృష్ణ హీరోగా నటించిన ”వీరసింహారెడ్డి” సినిమాలో నటించిన మంచి క్రేజ్ సంపాదించింది.as 103 ఇదేనిజం బాలయ్య హీరోయిన్‌కు లైంగిక వేధింపులు.. ప్రముఖ బంగారం వ్యాపారవేత్త అరెస్ట్..!!

Recent

- Advertisment -spot_img