నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు అంత ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ‘హనుమాన్’ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా ఓపెనింగ్ గురువారం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా పూజా కార్యక్రమం చివరి నిమిషంలో ఆగిపోయింది. అయితే ఈ సినిమా వాయిదా పడుతుందా లేక పూర్తిగా ఆగిపోయిందా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబో సినిమా దాదాపు ఆగిపోయినట్లే. మోక్షజ్ఞతో సినిమా చేసేందుకు వెంకీ అట్లూరి కూడా రెడీ అయ్యాడనే టాక్ వచ్చింది.మోక్షజ్ఞ మొదటి సినిమాకే ఇలా ఎందుకు జరుగుతుందో అని నందమూరి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.