ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి వేళ కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా తెల్లవారుజామునే తారక్, కళ్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ తన ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులర్పించారు.
ALSO READ: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్..
అయితే బాలకృష్ణ వచ్చి వెళ్లాక అక్కడ సీన్ మారిపోయినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఆదేశాలతో అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దనున్న తారక్ ఫ్లెక్సీలు తొలగించనట్టు తెలుస్తోంది. అయితే ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంలో బాలకృష్ణకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సన్నిహత వర్గాలు చెబుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర్లో ఉన్న సమయంలో చోటు చేసుకుంటున్న ఈ వరుస పరిణామాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.