అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ అధికారికంగా అవతరించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అధ్యక్షుడు జో బైడెన్ 2024, డిసెంబరు 24న ఆమోదం తెలిపారు. అమెరికా అధికారిక గుర్తుపై బాల్డ్ ఈగల్ చిత్రాన్ని 1782 నుంచి వినియోగిస్తున్నారు. అయితే ఆ పక్షిని ఇప్పటి వరకూ అధికారికంగా జాతీయ పక్షిగా ప్రకటించలేదు. తాజాగా అధ్యక్షుడి ఆమోదముద్రతో బాల్డ్ ఈగల్ అమెరికా జాతీయ పక్షిగా గుర్తింపు పొందింది.