కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీతోపాటు టీవీ రంగాన్ని కుదేలు చేసేసింది. వినోద రంగంపై ఆధారపడ్డ ఎందరో బతుకు తెరువు కోసం వీధిన పడ్డారు. పొట్టకూటికోసం ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ప్రసిద్ధ టీవీ సీరియల్ ‘Balika Vadhu’ డైరెక్టర్లలో ఒకరైన రామ్ వృక్ష గౌర్ ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అజమ్‌గర్ జిల్లాలో కూరగాయలను విక్రయిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్లు యశ్‌పాల్ శర్మ, మిలింద్ గునాజీ, రాజ్‌పాల్ యాదవ్, రణదీప్ హుడా, సునీల్ శెట్టి దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కరోనా రాకముందు రామ్ వృక్ష గౌర్ చేతిలో ఓ భోజ్‌పురి, ఓ హిందీ చిత్రానికి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి.
“కరోనా కారణంగా నేను పనిచేస్తున్న ప్రాజెక్టు ఆగిపోయింది. తరిగి మొదలయ్యేందుకు ఏడాది కాలం పడుతుందని ప్రొడ్యుసర్ చెప్పారు. దీంతో బతుకు తెరువు కోసం సొంతూరు వచ్చాను. నా తండ్రి బిజినెస్‌ను చేపట్టాలని భావించి కూరగాయలు అమ్ముతున్నాను.”అని డైరెక్టర్ రామ్ చెప్పారు.
‘‘రచయిత షహనావాజ్ ఖాన్ సహాయంతో 2002లో ముంబాయి పోయాను. మొదటగా లైట్ విభాగంలో.. ఆ తర్వాత టీవీ సీరియల్స్ నిర్మాణ విభాగం.. అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను. ‘బాలికావధు’ కు ఎపిసోడ్ డైరెక్టర్, యూనిట్ డైరెక్టర్‌గా సేవలు అందించాను”అని రామ్ వెల్లడించారు.