ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం ఆర్థికంగా అభివృద్ధి పరంగా వెనకబడిన ప్రాంతంగా ఉన్న దేవరకొండ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన దేవరకొండ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి నిరుపేద కుటుంబానికి అండగా ఉన్న నేనావత్ బాలు నాయక్ కి మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గం లో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించి ఈ నియోజకవర్గ మరింత అభివృద్ధి చెందుతుంది అని యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ&ఆఫీస్ అడ్మిన్ కేతావత సుభాష్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ, ఎంపి ఎన్నికల హడావుడి ముగిసిన అనంతరం క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో మంచి సంబంధాలు ఉన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కి కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రి పదవి ఇచ్చే ఆలోచన ఉందన్నారు.
గిరిజన ప్రాంతం అయినా దేవరకొండలో లంబాడీ తల్లులు పుట్టిన పిల్లలను సాధలేఖ ఆడ బిడ్డలు పిల్లలను అమ్ముకున్న ఘటనలు ఎన్నో జరిగాయని యువతి,యువకుల దాదాపుగా లక్ష పదివేల మంది నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. హైదరాబాద్ వంటి నగరాలలో వలస వెళ్లే ఆటోలు నడుపుతూ డ్రైవర్లుగా సెక్యూరిటీ గాడులుగా బతుకు జీవనాన్ని గడుపుతూ కాలం వెళ్ళదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అట్టి కష్టాల నుంచి బయట పడాలంటే భారీ మెజార్టీతో రెండోసారి శాసనసభ్యులుగా అసెంబ్లీలో అడుగుపెట్టిన నేనావత్ బాలు నాయక్ కి మంత్రి పదవి ఇచ్చి ఈ వెనుకబడ్డ గిరిజన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిచేలా నూతన ప్రభుత్వంలో అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించాలన్నారు ముఖ్యంగా ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు కష్టపడి పార్టీ కోసం పని చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.