Homeజిల్లా వార్తలుబాలు నాయక్ కు మంత్రి పదవి ఇవ్వాలి :మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని...

బాలు నాయక్ కు మంత్రి పదవి ఇవ్వాలి :మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి

ఇదే నిజం, దేవరకొండ: తెలంగాణ రాష్ట్రంలోనే వెనుకబడిన-దేవరకొండ నియోజకవర్గంలో గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు ఎక్కువ శాతం ఉన్న దేవరకొండ ప్రాంతానికి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఎస్ ఎల్ బి సి పూర్తి కావాలన్న డిండి ఎత్తిపోతల పథకం త్వరితగతిన పూర్తి చేయాలన్న బాలు నాయక్ కి మంత్రి పదవి ఇవ్వాలని మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో గిరిజన తెగలకు చెందిన, కోయ సామాజిక వర్గానికి చెందిన, లంబాడి సామాజిక వర్గానికి చెందిన గిరిజనులు ఎక్కువ శాతం ఉన్నారు. కావున లంబాడి సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కి రాబోయే మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజాసేవకుడిగా పనిచేసి ఎమ్మెల్యేగా నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన బాలునాయక్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకుడిగా పని చేస్తున్నారు. ప్రజా సంఘాలలో సభ్యుడిగా ఎంతో అనుభవం కలిగిన ప్రజా నాయకుడు తాను పదవుల్లో ఉన్న సమయంలో ఎలాంటి పొరపాటు చేయని నిజాయితీ పరుడుగా అన్ని పదవులు నిర్వహించిన ఎమ్మెల్యే బాలునాయక్ కు మంత్రి పదవి ఇవ్వాలని మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బోయిని చంద్రమౌళి ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు.

Recent

- Advertisment -spot_img