ఆరోగ్యానికి హానికరమైన గుట్కాను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే 24 నుంచి ఏడాది కాలం పాటు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. గుట్కా, పాన్ మాసాలలో ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు, నికోటిన్ ఉండడం మూలంగానే వాటిని నిషేధించినట్లు పేర్కొన్నారు. గుట్కాను తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.